Breaking : కవితకు మరోసారి షాక్
కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి కొంత సమయం సుప్రీం ఇచ్చింది. గురువారం వరకూ ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బెయిల్ వస్తుందని...
ఈరోజు బెయిల్ పై విచారణ జరగనుండటంతో కల్వకుంట్ల కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా బెయిల్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.